Monday, September 23, 2013

Nuvvu Nenu

నువ్వు - నేను

< Inspired by Eenaadu Sunday Magazine story >
                                                                   నువ్వు - నేను

నేను మనసు మమత తెలీని పాషానాన్ని
   నువ్వు ఓరిమితో అందమైన శిల్పంగా చెక్కావు

నా మూర్ఖత్వాన్ని సహించావు
నా కోపాన్ని భరించావు

నేను విషాన్ని చిమ్మితే అమృతంలా సంగ్రహించావు
నేను శూలాల్లాంటి మాటలతో తూట్లు పొడిస్తే పూలదండలా స్వీకరించావు

అమ్మ లా లాలించావు, గురువు లా బోధించావు
కష్ట నష్టాల కోర్చి పట్టుదలతో నన్ను మార్చుకున్నావ్

నేను మారానని నీకు రుజువు చేసేలోపలే ఎందుకు నా జత వీడిపోయావ్

ఎప్పుడు నన్ను వెన్నంటే ఉంటావని నీ చిన్ని చిన్ని కోరికలు కూడా తీర్చలేదే
భాద్యతలతో, స్నేహాలలో ములిగిపోయి నీ  అభిరుచులు, అభిలాషలు గమనించలేదే
నువ్వు నేను ఒకటేనని, నా మనసు నీకు తెలుసనీ
నీపై వున్న అవాజ్యమైన ప్రేమని ఏనాడూ నోరారా చెప్పలేదే

ఒక్కసారి.. నిన్ను తనివి తీరా హత్తుకోవాలని వుంది
నా కన్నీటితో నీకు అభిషేకం చేయాలని వుంది
నీ ఒడిలో సేద తీరాలని వుంది
నా ప్రేమతో నిన్ను ముంచెత్తాలని  వుంది

నువ్వుండగా నేను పెట్టిన క్షోభకి నీ వియోగంతో ఎంత శిక్ష వేశావ్
ఎన్ని తప్పులు చేసినా ఈ శిక్ష భరించగలనని ఎలా భావించావ్

ప్రతీ క్షణం జీవచ్చవంలా బ్రతకమని నన్నెందుకిలా శాసించావ్
ఫోటో లోని నీ చిరునవ్వుని చూసి పశాత్తాపం తో ప్రతి క్షణం నన్నెందుకిలా కుమిలిపోయాలా చేసావ్

నువ్వు లేని నేను .. ఇప్పుడు ఏమి కాను? .. ఏమై పోను?..
.... ఎలా బ్రతకను ????....

No comments:

Post a Comment