- అమ్మమ్మ వూరు - (1978)
తెల్లవారు జామునే నిద్ర నుంచి లేపే గుడి సుప్రభాతం
సుప్రభాతం అయ్యేలోగానే ప్రసాదం కోసం గుడికి పరుగులు
గుడిని ఆనుకొని చెరువు, చెరువు మధ్యలో తామరలు
ప్రొద్దున్నే బిందెలు నెత్తికెత్తుకుని చెరువు నుంచి వెళ్ళే అతివలు, వాళ్ళ కాలి మువ్వల సవ్వడులు
అమ్మమ్మ చావిట్లో చేస్తున్న తాటి రొట్టె వాసనలు, అది తినటానికి అన్నా చెల్లెళ్ళతో పోటీలు
వీధి గుమ్మంలో మామయ్యల బాతాఖాని, అర్ధం అయ్యీ కాని వూరి రాజకీయాలు
పావలా దొరికితే సుబ్బిశెట్టి కొట్టుకు పరుగులు, అందరితో పంచుకున్న జీళ్ళు, పప్పులు
అర్ధ రూపాయ కోసం పెదనాన్న ఎదురుగా చేసిన ఎన్టీఆర్ డాన్సులు, ఆ డబ్బులతో టౌన్ లో ఏ సినిమా చూడాలని వేసిన ప్లానులు
"పాత ప్రెసిడెంట్ గారి మనవడు" అని పిలిస్తే తెలియని సిగ్గు, మొహమాటం
ఎక్కడో తాతయ్య ఊరికి మంచి చేసుంటారని కించిత్తు గర్వం
అమ్మమ్మ ప్రేమతో తినిపించే ముద్దపప్పు ఆవకాయ
నిద్రలో జారేముందు ఆరు బయట నక్షత్రాలతో చెప్పిన కబుర్లు
చాకలి చెరువులో దోసిళ్ళలో పట్టిన చేప పిల్లలు, అవి పెట్టిన కితకితలు, గిలిగింతలు
పాలేరు కొట్టి ఇచ్చిన కొబ్బరి బొండాలు, తాటి ముంజెలు, వాటితో చేసిన చక్రాల బళ్ళు, వాటి పరుగు పందాలు
పెళ్లి కూతురైన చివరి పిన్నికి, పెళ్లికొడుక్కి మధ్య మోసిన కబుర్లు, లేఖలు, లంచంగా తీసుకున్న డబ్బులు
ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీసులో పని చేసే పెద్ద మావయ్య బీరువాలోంచి లేపేసి ఇల్లంతా ఊదేసినన "బుడగలు", బహుమతిగా తిన్న దెబ్బలు
ఇంటి నుంచి స్కూల్ కెళ్ళే లోగా రిక్షా సుబ్బడి ని పెట్టిన ముప్పుతిప్పలు, రోజూ అమ్మమ్మ తో వాడు చెప్పిన కంప్లైంట్లు
భోషాణం పెట్టెలో దాక్కుని ఒక్క పూట లో మొత్తం తినేసిన వూరు వారిచ్చిన సారె, డాక్టర్ గారు పొడిచిన ఇంజక్షన్ లు
నీ కొడుకుని భరించడం నా వాళ్ళ కాదు అని అమ్మమ్మ పోస్ట్ మాస్టారి తో అమ్మకి రాయించిన వుత్తరం, వుత్తరంలో ఎఅకరువు పెట్టిన సంగతులు
ఎం చెయ్యాలో పాలు పోక, తాహతుకి మించినా, కొడుకు బాగుపదతాడని హాస్టల్ లో 3 వ క్లాసు లో పడేసిన నాన్న - మధ్యలో నే ఆగిపోయిన బాల్యం.....

No comments:
Post a Comment