<-- Common Man -->
ఏ ఒక్క భాష పైనా పూర్తిగా పట్టు లేదు
లౌక్యంగా మాట్లాడే కనికట్టు రాదు
తిమ్మిని బమ్మి చేసే తెలివి లేదు
కొందరి కన్నీటినైనా తుడిచేంత కలిమీ లేదు
టెన్త్ వరకు తెలుగులో, ఇంటర్ నుంచి ఇంగ్లీష్ లో నడిచిన వానా కాలం చదువు
కిరాణా కొట్టు నుంచి ఇంటికి, చేతి నుంచి నోటికి సరిపడేంత పైసలే ఇచ్చే కొలువు
అయినా..
అమ్మా నాన్న ఇచ్చిన సంస్కారం వుంది
గురువులు నేర్పిన బుద్ధి వుంది
ప్రక్కవాడి కన్నీటిని తుడిచే గుండె తడి ఉంది
అందరి సంతోషాన్ని పంచుకునే ఆత్మీయపు ఒడి వుంది
మంచి చెయ్యాలనే కోరిక వుంది,
మంచి చెప్పటానికి తీరిక వుంది
తరిగిపోతున్న మానవ విలువలను గుర్తు చెయ్యాలనే తపన వుంది
చెదిరిపోతున్న జీవితాలను (అపార్ధాలతో, ఫాల్స్ ప్రెస్టేజ్ తో) సరిదిద్దాలనే ఆశ వుంది
విష బీజాలు జనం లో నాటి శవాల పై కోట్లు గడించే వారి పై అసహ్యముంది
తమ కంటిని తమ చేత్తో పొడుచుకొనే వారిపై జాలి వుంది
అందరు సంతోషంగా కలకాలం కలిసి ఉండాలనే అభిలాష వుంది!!
- జతీన్
No comments:
Post a Comment