Monday, September 23, 2013

Aaasa - Aasa - Aasa

ఆశ .. ఆశ .. ఆశ 

రాత్రి తాగొచ్చి చితక్కొట్టే ప్రొద్దున్నే కాళ్ళు గడ్డం పట్టుకొని బ్రతిమాలే మొగుడు రేపటినుంచి తాగిరాడని రత్తాలు కు ఆశ

నమ్మకంతో ఎన్నుకుంటే 40 కోట్లు తినేసిన (వి)నాయకుడు నెక్స్ట్ టైం బెస్ట్ అనిపించుకుంటాడని ఆదర్శ్ ఆశ

బంద్ లతో, ఇబ్బందులతో బంద్ అయిపోయిన జిందగీ కా గాడీ తిరిగి గాడి లో పడుతుందని యాదగిరి ఆశ

shift లలో తన వృద్ధాప్యాన్ని పంచుకునే కొడుకుల ఆలోచనలు ఈ సారైనా తన వైపు shift అవుతాయేమో నని కుటుంబ రావు ఆశ

Hike ఇవ్వడానికి మౌంట్ ఎవరెస్ట్ Hike చేసినట్టు ఫీలయ్యే బాస్ ఈ సారైనా ఇస్తాడని ఉద్యోగరావు ఆశ

నాల్గు సంవత్సరాల నుంచి జీడిపాకం లా సాగుతోన్న "నర మేధం" సీరియల్ next రోజే end అయ్యిపోవాలని నగేష్ ఆశ

రవితేజ, చిరంజీవి లా తానూ ఏదో ఒక రోజు వెండితెర మీద వెలిగిపోవాలని ఇంట్లో చెప్పకుండా రైలెక్కి వచ్చేసిన కృష్ణా నగర్ వర్ధమాన్ (నటుడు) ఆశ

నేను రాసిన ప్రతీ వాక్యం ఇంతవరకు చదివి, తిట్టుకోకుండా మనసారా అశ్వీరదించాలని నా చిన్ని ఆశ

ఆశ ... ఆశ ... ఆశ..
ఆశ జీవితానికి శ్వాస

నిరాశ బ్రతికున్న మనిషిని చంపేస్తుంది
ఆశ..ఆశ..ఆశ.. ఆశ చచ్చిపోయే మనిషిని బ్రతికిస్తుంది..

-జతీన్

No comments:

Post a Comment