Thursday, October 3, 2013

Jeevitam - Lekka

<From an old school teacher>
  జీవితం ... లెక్క 

గుండెల్ని పిండేసిన నీ కబురు
కళ్ళని మూసేసిన కన్నీరు


నేను నీకు గురువుగా పాఠం నేర్పాను
నువ్వు నీ జీవితంతో నాకు గురువయ్యావు


నిష్కల్మషమైన నీ చిరునవ్వు
నిర్మలమైన నీ మనస్సు
సాధించాలనే నీ తపన
నన్ను వెంటాడుతూనే వుంటాయి బంగారూ


నిన్ను అబద్ధాలు చెప్పొద్దని దండించాను
కాని
నాకు తెలిసిన ఈ నిజం అబద్ధమైతే ఎంత బాగుండేది చిన్నారూ


నీకు రాని లెక్కను చెప్పగలను
కాని
నీ బ్రతుకు లెక్కని సరిదిద్దలేని ఆశక్తున్ని, అభాగ్యున్ని బంగారు


నేను ఉత్త లెక్కల మాస్టారిని
క్లాసు లో ఎన్ని కూడికలు, గుణకారాలు చేసినా జేవితంలోని భాగహారాల తో "సశేషం" గా మిగిలిన బడి పంతులుని .. ఉత్త బడి పంతులుని


నా ఆయుష్షు పోసుకో..
నవ్వుతూ తిరిగి త్వరగా రా

మనం కలిపి చెయ్యాల్సిన లెక్కలు ఇంకా జీవితానికి సరిపడా వున్నాయి !!!

-జతీన్